లాక్‌డౌన్.. వీడియో కాల్‌లో వివాహం

లాక్‌డౌన్.. వీడియో కాల్‌లో వివాహం

కరోనా వైరస్‌ కారణంగా కేంద్ర సర్కార్ దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ను అమలు చేస్తుంది. ఈ నేపథ్యంలో నిత్యావసరాల సేవలు తప్ప మిగతా అన్ని సేవలను నిలిపివేశారు. ఈ సమయంలో ప్రజలంతా ఇళ్ల​కే పరిమితమయ్యారు. దీంతో పెళ్లి వేడుకలు, ఫంక్షన్‌లు వాయిదా పడ్డాయి.

అయితే కొందరు తాము అనుకున్న ముహుర్తానికి పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. అది కూడా వీడియో కాల్‌ లేదా ఇతర యాప్‌ల ద్వారా వివాహం చేసుకుంటున్నారు. ఇలాంటి అరుదైన సంఘటన మహరాష్ట్రలో జరిగింది.

మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌కు చెందిన మహమ్మద్‌ మీన్హాజుద్‌కు బీద్‌ యువతితో వివాహం నిశ్చయమైంది. ఏప్రిల్‌ 3న వివాహం జరిపించాలని ఆర్నేళ్ల క్రితమే నిర్ణయించారు. లాక్‌డౌన్‌ కారణంగా పూర్తిగా రవాణా వ్యవస్థ నిలిచిపోయింది. దీంతో ఇరు కుటుంబ సభ్యులు వినూత్నంగా వీడియో కాల్‌ ద్వారా పెళ్లి తంతును కానిచ్చేశారు. శుక్రవారం మధ్యాహ్నం వీడియో కాల్‌ ద్వారా వరుడు మహమ్మద్‌కు జౌరంగబాద్‌కు చెందిన వధువుతో నిఖా జరిపించారు. ఈ కార్యక్రమానికి కేవలం ఇంటి సభ్యులు మాత్రమే హాజరయ్యారు. తక్కువ ఖర్చుతో, సింపుల్‌గా పెళ్లి జరిగిపోయిందని ఇరు కుటుంబాలు పేర్కొన్నాయి.

Tags

Read MoreRead Less
Next Story