కరోనా బారిన పడిన పులి.. ఈ వ్యాధి సోకిన మొదటి జంతువు

కరోనా బారిన పడిన పులి.. ఈ వ్యాధి సోకిన మొదటి జంతువు

ఇప్పటివరకు మనుసులుపై విరుచుకుపడిన కరోనా.. ఇప్పుడు జంతువులపై కూడా ప్రభావం చూపిస్తుంది. తాజాగా అమెరికాలో ఒక పులికి కరోనా సోకినట్టు తేలింది. న్యూయార్క్‌ బ్రాంగ్జ్‌ జూపార్క్‌లో ఉండే నదియా అనే నాలుగేళ్ల పులికి వైరస్‌ సోకిందని జూ యాజమాన్యం తెలిపింది. ఆ పులి బాగోగులు చూసుకునే వ్యక్తి నుంచే దానికి వైరస్‌ వ్యాపించి ఉంటుందని అనుమానిస్తున్నారు. నదియా చెల్లి అజుల్‌ అనే పులితో పాటు మరో మూడు ఆఫ్రికా సింహాలూ వైరస్‌ లక్షణాలతో కనిపిస్తున్నాయని న్యూయార్క్‌లోని జూపార్క్‌లను పర్యవేక్షించే వైల్డ్‌లైఫ్‌ కంజర్వేషన్‌ సొసైటీ ఆశాభావం వ్యక్తంచేసింది.

అయితే.. నదియాకు కరోనా పరీక్షలు చేయడానికి చాలా కష్టపడాల్సి వచ్చిందని ఆ సంస్థ తెలిపింది. ప్రస్తుతం ఆకలి మందగించటం మినహా.. వాటి ఆరోగ్యంగానే బాగానే ఉందని తెలిపారు. ‘జంతువులపై వైరస్‌ వైరస్ ప్రభావం ఎలా ఉంటుందనే దానిపై స్పష్టత రాలేదని.. కానీ, నిరంతరం వాటిని మానిటరింగ్‌ చేస్తున్నామని అన్నారు. అటు.. వాటితో పాటు వాటి సంరక్షకులకు సైతం తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఆ సంస్థ వివరించింది.

Tags

Read MoreRead Less
Next Story