కరోనాను వ్యాప్తి చేస్తున్నారని ఫిలిప్పీన్స్ జాతీయులపై మహారాష్ట్రలో కేసు

కరోనాను వ్యాప్తి చేస్తున్నారని ఫిలిప్పీన్స్ జాతీయులపై మహారాష్ట్రలో కేసు

కరోనాని వ్యాపింపజేస్తున్నారని 10 మంది ఫిలిప్పీన్స్ జాతీయులపై మహారాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేశారు. ముంబైలోని వసి ప్రాంతంలో గుర్తించిన వీరిపై.. ఐపీసీ సెక్షన్లు 188, 269, 270; ఫారినర్స్ యాక్ట్, 1946 సెక్షన్ 14; మహారాష్ట్ర కరోనా రెగ్యులేషన్స్ సెక్షన్ 11 ప్రకారం కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.

నిందితులు ఢిల్లీలోని తబ్లిగి జమాత్ కార్యక్రమాల్లో పాల్గొన్నారని.. అక్కడ నుంచి వచ్చిన తరువాత.. మార్చి 10 నుంచి 16 వరకు వసిలోని మసీదులో ఉన్నారని తెలిపారు. అయితే.. వారు ఢిల్లీలో కార్యక్రమానికి హాజరైన విషయం తెలియజేయకుండా ఈ మసీదులో వీరు బస చేశారని పోలీసులు ఆరోపించారు. ఢిల్లీలోని మత ప్రార్థనల్లో కరోనా వ్యాపించిందని తెలిసినా.. వసిలోని మసీదుకు వీరు వచ్చారని తెలిపారు.

నిందితుల్లో ఒకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు వెల్లడించారు. ఈ వ్యక్తి వసి మసీదులో కొందరిని కలిసినట్లు, వారికి కూడా కరోనా సోకినట్లు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story