కరోనాను జయించిన పది నెలల బాలుడు

కరోనాను జయించిన పది నెలల బాలుడు

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని పది నెలల బాలుడు జయించాడు. తమిళనాడుకు చెందిన బాలుడు కోయంబత్తూరులోని ఈఎస్ఐ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు. అయితే ఈ చిన్నారికి మళ్లీ పరీక్షలు నిర్వహించగా నెగటివ్ అని తేలడంతో సోమవారం డిశ్చార్జ్ చేశారు. ఆ బాలుడి తల్లి రైల్వే డాక్టర్‌గా పని చేస్తున్నారు. ఓ పేషెంట్ ద్వారా ఆమెకు కరోనా సోకగా.. తల్లి నుంచి ఆ పసివాడికి కోవిడ్ సోకింది. హాస్పిటల్‌లో ఐసోలేషన్‌లో ఉంచిన అనంతరం ఆ బాలుడితోపాటు అతడి తల్లి శాంపిళ్లను రెండు సార్లు పరీక్షించగా నెగటివ్ అని తేలింది. దీంతో వారిని డిశ్చార్జ్ చేశారు. 10 నెలల బాలుడు కోవిడ్ పాజిటివ్ నుంచి కోలుకుని కోవిడ్ నెగటివ్‌గా రావడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

Tags

Read MoreRead Less
Next Story