కరోనాను అడ్డుకునేందుకు ఒడిశా కీలక నిర్ణయం

కరోనాను అడ్డుకునేందుకు ఒడిశా కీలక నిర్ణయం
X

కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో.. దానిని అడ్డుకునేందుకు ఒడిశా ప్రభుత్వం.. రాష్ట్ర ప్రజలకి కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇంటి నుంచి బయటకి వచ్చినవారు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని ప్రకటన చేసింది. ఈ నెల 9 నుంచి దీన్ని తప్పనిసరి చేస్తూ ఒడిశా సర్కారు నిర్ణయం తీసుకుంది. రెండు లేయర్ల మాస్కుల ద్వారా నోటిని, ముక్కునూ పూర్తిగా కవర్ చేసుకోవాలని సూచించింది. మాస్కులు అందుబాటులో లేని వారు కనీసం కర్చీఫ్‌లు, చున్నీలతోనైనా నోరు, ముక్కు కవర్ చేసుకోవాలని తెలిపింది. మాస్కును తప్పనిసరి చేసిన తొలి రాష్ట్రం ఒడిశాయే. కరోనా కారణంగా ఒడిశాలో ఇప్పటివరకూ 39 కేసులు నమోదవ్వగా.. ఆ లక్షణాలతో 87 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

Next Story

RELATED STORIES