ఢిల్లీ అధికారులు అనుమతి ఇవ్వకపోతే.. ఇంత నష్టం జరిగేది కాదు: శరద్ పవర్

ఢిల్లీలో తబ్లిగీ అధికారులు అనుమతి ఇవ్వకుంటే బాగుండేదని ఎన్సీపీ అధినేత శరద్ పవర్ పేర్కొన్నారు. అనుమతి నిరాకరించి ఉంటే దేశంలో ఇంత భారీ నష్టం జరిగి ఉండేది కాదని ఆయన స్పష్టం చేశారు. ఫేస్‌బుక్ వేదికగా మహారాష్ట్ర ప్రజలతో మాట్లాడిన ఆయన.. తమ ప్రభుత్వం మహారాష్ట్రలో ఆ సంస్థ సమావేశానికి అనుమతి నిరాకరించినట్లు ఆయన తెలిపారు.
కరోనా ప్రభావం ఇంత ఎక్కువగా ఉన్నపుడు తబ్లీగీ అంతర్జాతీయ సదస్సును నిర్వహించకూడదని అన్నారు. మహారాష్ట్రలో కూడా నిర్వహకులు అనుమతి కోరితే.. సీఎం ఉద్ధవ్, హోంమంత్రి దేశ్‌ముఖ్ అనుమతి ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారని తెలిపారు. ఢిల్లీ అధికారులు కూడా ఇదే నిర్ణయం తీసుకుంటే నేడు ఈ పరిస్థితి ఉండేదే కాదని ఆయన అన్నారు. మరోవైపు మహారాష్ట్రలోని సోలాపూర్‌లో ఎద్దుల పోటీ నిమిత్తమై అధిక సంఖ్యలో గుమిగూడారని, వెంటనే పోలీసులు వారందరిపై కేసులు నమోదు చేశారని శరద్ పవర్ అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com