ట్రంప్‌పై మండిపడ్డ కాంగ్రెస్ నేత శశిథరూర్

ట్రంప్‌పై మండిపడ్డ కాంగ్రెస్ నేత శశిథరూర్
X

హైడ్రాక్సీక్లోరోక్విన్ మీ సరుకు ఎలా అవుతుందంటూ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై కాంగ్రెస్ నేత శశిథరూర్ మండిపడ్డారు. ఓ దేశాధ్యక్షుడు మరో దేశాన్ని ఇలా బహిరంగంగా బెదిరించడం ఇంతవరకు తానూ చూడలేదని ట్విట్టర్ వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేశారు.

కరోనా నేపథ్యంలోనే హైడ్రాక్సీక్లోరోక్విన్ ఎగుమతులను నిషేధించాలని కేంద్ర ప్రభుత్వం భావించింది. అయితే.. హైడ్రాక్సీక్లోరోక్విన్.. కరోనా పై బాగా పని చేస్తోంది. దీంతో పలు దేశాలు దీనిని మెడిసిన్ గా వాడుతున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమకు రావాల్సిన హైడ్రాక్సీక్లోరోక్విన్‌ను పంపాలని భారత్ ను డిమాండ్ చేశారు. అలా చేయకపోతే కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించారు. దీనిపైనే శశిథరూర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. హైడ్రాక్సీక్లోరోక్విన్ మీ సరుకు ఎలా అవుతుంది? భారత్ మీకు అమ్మితేనే అది మీ సరుకు. అలా చేయకపోతే ఆ మందు మీది ఎలా అవుతుంది? అని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు.

Next Story

RELATED STORIES