కరోనా ఎఫెక్ట్.. అమ్మకు అంత్యక్రియలు చేయలేనన్న కుమారుడు

కరోనా ఎఫెక్ట్.. అమ్మకు అంత్యక్రియలు చేయలేనన్న కుమారుడు

కరోనాతో మృతి చెందిన ఓ తల్లికి అంత్యక్రియలు నిర్వహించడానికి ఆమె కుమారుడు నిరాకరించాడు. ఆమెకు అంత్యక్రియలు జరిపితే.. తమకు కూడా సోకుతుందని ఆమె కుటుంబ సభ్యులు భయపడ్డారు. ఈ ఘటన పంజాబ్‌లో చోటు చేసుకుంది.

ఆ వృద్ధురాలు కరోనా లక్షణాలతో మార్చి 31న ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందింది. దీంతో ఆమె మృతదేహాన్ని తీసుకోవడానికి నిరాకరించిన ఆమె కుటుంబ సభ్యులు.. ఆ కార్యక్రమాన్ని జిల్లా అధికారులే పూర్తి చేయాలని వాళ్లు కోరారు.

జిల్లా అధికారి ఒకరు మాట్లాడుతూ.. ఆమె బంధువులే కాదు.. ఆఖరికి ఆమె కుమారుడు కూడా ఆమె మృతదేహాన్ని తీసుకొని వెళ్ళడానికి నిరాకరించడం చూసి మేము నిజంగా ఆశ్చర్యపోయామని అన్నారు. తాము.. కుటుంబసభ్యులను రెండుసార్లు సంప్రదించి... వాళ్లకు వైరస్ సోకకుండా రక్షణ ఏర్పాట్లు చేస్తామని చెప్పినా.. అతను అందుకు అంగీకరించలేదని అన్నారు. చివరికి జిల్లా అధికారులే ఆమె మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు.

మృతి చెందిన మహిళ కుమారుడితో పాటు.. కుటుంబసభ్యులు 100 మీటర్ల దూరంలో నిలబడి ఆమె అంత్యక్రియలను చూశారని అధికారులు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story