Top

కరోనా ఎఫెక్ట్.. గ్రామంలోకి ప్రవేశిస్తే రూ.5 వేలు జరిమానా

కరోనా ఎఫెక్ట్.. గ్రామంలోకి ప్రవేశిస్తే రూ.5 వేలు జరిమానా
X

కరోనా మహమ్మారి నివారించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యల్ని తీసుకుంటున్నాయి. ప్రజలు కూడా తమ వంతుగా కరోనాని దరిచేరనీయకుండా ముందకొచ్చారు. కరోనా వైరస్ తీవంగ్రా విజృభిస్తున్న నేపథ్యంలో గ్రామస్థులు వారి నివాస ప్రాంతాలకు కొత్తవారు రావడంగానీ.. గ్రామస్థులు ఇతర ప్రాంతాలకు వెళ్లడాన్ని గానీ కొనసాగకుండా కట్టుదిట్టమైన చర్యల్ని తీసుకున్నారు. పలుచోట్ల గ్రామలకు చేరుకునే అన్ని మార్గాల్ని మూసివేశారు. ఉత్తరప్రదేశ్‌లోని ఓ గ్రామం కఠిన నిర్ణయం తీసుకుంది. ఆ గ్రామంలోకి ఎవరైనా కొత్త వ్యక్తులు ప్రవేశిస్తే ఏకంగా ఐదు వేల రూపాయల జరిమానా చెల్లించాల్సిందే.

హపూర్‌ జిల్లాలోని బచ్రౌతా గ్రామంలోకి ఇతర వ్యక్తులు ఎవరైనా ప్రవేశిస్తే రూ. 5 వేలు జరిమానా విధించాలని నిర్ణయించింది. కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నామని గ్రామా పెద్దలు చెబుతున్నారు.

Next Story

RELATED STORIES