కేంద్ర ఆరోగ్య శాఖ రాష్ట్ర ప్రభుత్వాలకు కీలక ఆదేశాలు

కేంద్ర ఆరోగ్య శాఖ రాష్ట్ర ప్రభుత్వాలకు కీలక ఆదేశాలు

కేంద్ర ఆరోగ్య శాఖ రాష్ట్ర ప్రభుత్వాలకి కీలక ఆదేశాలు జారీ చేసింది. కరోనా రోగుల కోసం అన్ని రాష్ట్రాలలో మూడు రకాల ఆస్పత్రులను సిద్ధం చేయాలని తెలిపారు. కరోనా తీవ్రతను బట్టి.. ఆయా ఆస్పత్రిలో రోగులకు చికిత్స అందించాలని అన్నారు.

కరోనా అనుమానితులను కొవిడ్ కేర్ సెంటర్లలో, కరోనా తీవ్రత మధ్యస్థంగా ఉన్న వారిని కొవిడ్ హెల్త్ సెంటర్లలో, కొవిడ్ తీవ్రవత ఎక్కువగా ఉన్న రోగులను కొవిడ్ ప్రత్యేక ఆసుపత్రుల్లో వైద్యచికిత్సలు చేయాలని ఆరోగ్యశాఖ అధికారులు నిర్ణయించారు. కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న రోగులను ప్రత్యేకంగా ఐసీయూ, వెంటిలేటర్లు ఉన్న ఆసుపత్రుల్లో చేర్చాలని కేంద్ర ఆరోగ్యశాఖ కోరింది. కరోనా కేసుల్లో 70 శాతం ప్రాథమిక దశలోనే ఉన్నందున వారిని కొవిడ్ కేర్ సెంటర్లు, కొవిడ్ హెల్త్ సెంటర్లలోనే చికిత్స చేయవచ్చని కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు చెపుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story