ప్రైవేట్ ల్యాబ్‌లలో కూడా కరోనా పరీక్షలు ఉచితంగా జరగాలి: సుప్రీం కోర్టు

ప్రైవేట్ ల్యాబ్‌లలో కూడా కరోనా పరీక్షలు ఉచితంగా జరగాలి: సుప్రీం కోర్టు

కరోనా పరీక్షలకు ప్రైవేట్ ల్యాబ్‌లలో కూడా ఫీజు వసూలు చేయరాదని సుప్రీం కోర్టు.. కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. ప్రస్తుతం ప్రభుత్వ ల్యాబ్‌లలోమాత్రమే కరోనా టెస్ట్‌లు ఉచితంగా జరుగుతున్నాయి. అయితే.. సుప్రీం కోర్ట్ ఆదేశాలను కేంద్రం అమలు చేస్తే.. దేశవ్యాప్తంగా అన్ని ప్రైవేట్ ల్యాబ్‌లలో కూడా ఉచిత పరీక్షలు జరుగుతాయి.

దేశవ్యాప్తంగా కరోనా పరీక్షలు చాలా తక్కువగా జరుగుతున్నాయని.. పెద్ద ఎత్తున జరగాల్సిన అవసరం ఉందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ తరుణంలో సుప్రీంకోర్టు సూచనకు ప్రాధాన్యత ఏర్పడింది.

Tags

Read MoreRead Less
Next Story