భారత్ పై ప్రశంసల వర్షం కురిపించిన ట్రంప్

భారత్ పై ప్రశంసల వర్షం కురిపించిన ట్రంప్
X

రెండు రోజుల క్రితం భారత్.. తనకు హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ పంపించకపోతే ప్రతీకారం తీర్చుకుంటామని వ్యాఖ్యలు చేసిన ట్రంప్.. తాజాగా భారత్ పై ప్రశంసల వర్షం కురిపించారు.

హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ ఎగుమతిపై ఉన్న నిషేధాన్ని పాక్షికంగా ఎత్తివేస్తూ.. భారత్‌ తీసుకున్న నిర్ణయంపై స్పందించిన ట్రంప్ ఆయన స్వరం మార్చారు. ఓ న్యూస్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మత్లాడిన ఆయన కరోనాపై భారత్ చేస్తున్న పోరాటం హర్షణీయమని అన్నారు. కరోనాపై పోరాటానికి 29 మిలియన్లకు పైగా హెచ్‌సీక్యూ డోసులు కొనుగోలు చేశామని.. ఇందులో ఎక్కువగా భారత్ నుంచే వచ్చాయని అన్నారు. దీనిపై భారత ప్రధాని మోదీతో నేను మాట్లాడానని.. ఆయన నిజంగా చాలా మంచివారని అన్నారు. వాస్తవానికి భారత్‌లో కూడా హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ అవసరం చాల ఉండటంతో.. వాటిని పంపుతారా లేదా అని నేను మోదీని అడిగానని అన్నారు.కానీ.. మోడీ మంచి మనసుతో వాటిని పంపుతున్నారని అన్నారు.

Next Story

RELATED STORIES