నిరాశ్రయులకు ఏర్పాట్లు జరిగాయా?: అఖిలేశ్ యాదవ్

నిరాశ్రయులకు ఏర్పాట్లు జరిగాయా?: అఖిలేశ్ యాదవ్
X

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు లాక్‌డౌన్ విధించిన నేపథ్యంలో నిర్వాసితులైనవారికి, ఆకలితో బాధపడేవారికి ఎటువంటి ఏర్పాట్లు జరిగాయో విశ్లేషణ జరగాలని సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ డిమాండ్ చేశారు. కరోనా కారణంగా దేశంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులపై ట్వీటర్ లో స్పందించిన ఆయన.. సహాయక నిధులపై కూడా విశ్లేషణ అవసరమని తెలిపారు. తబ్లిగి జమాత్ కార్యక్రమాలకు హాజరైనవారు పట్టుబడుతున్న నేపథ్యంలో.. ఎవరికి, ఎందుకు, ఎప్పుడు వీసాలు ఇచ్చారనేదానిని కూడా సదుద్దేశంతో విశ్లేషణ చేయాలి. కరోనా వైరస్ నిర్థరణ పరీక్షలు ఎందరికి జరిగాయి? ఇతర వ్యాధులకు సరైన చికిత్స అందుబాటులో ఉందా? ఆకలితో ఉన్నవారికి, నిరాశ్రయులైనవారికి ఏర్పాట్లు జరిగాయా?’’ అని ప్రశ్నించారు.

Next Story

RELATED STORIES