గుజరాత్‌లో 24 గంటల్లో 67 కొత్త కరోనా కేసులు

గుజరాత్‌లో 24 గంటల్లో 67 కొత్త కరోనా కేసులు
X

కరోనా మహమ్మారి గుజరాత్‌లో మరింత విస్తరిస్తుంది. 24 గంటల్లో 67 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయని గుజరాత్ రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో 308 కరోనా కేసులు ఉన్నట్టు తెలుస్తుంది. ఈ మేరకు మీడియాకు సమాచారం ఇచ్చిన రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయంతి రవి.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. వారికి వెంటిలేటర్లపై చికిత్స అందిస్తున్నామని ఆమె తెలిపారు. అయితే.. రాష్ట్రములో ఎక్కువ కేసులు అహ్మదాబాద్ లో నమోదవుతున్నాయి. గత రెండు రోజుల్లో ఎక్కువ కేసులు నమోదవుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయింది.

Next Story

RELATED STORIES