మహమ్మారిపై కలిసి పోరాటం చేద్దాం.. సాయం చేసేందుకు మేము సిద్ధం: మోదీ

మహమ్మారిపై కలిసి పోరాటం చేద్దాం.. సాయం చేసేందుకు మేము సిద్ధం: మోదీ

మిత్ర దేశాలకు సాయం చేయడానికి భారత్ ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ ఉత్పత్తి చేసే ముడి పదార్థాలు పలు దేశాలకు ఎగుమతి చేసారున్న నేపథ్యంలో.. ఆదేశ అధ్యక్షులు భారత్ కు కృతఙ్ఞతలు తెలుపుతున్నారు. దీనికి మోడీ ఈ మేరకు స్పందిస్తున్నారు. కరోనా పై పోరులో ప్రాణాధార ఔషధాలను భారత్ ఇజ్రాయిల్‌కు పంపినందుకు ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహూ ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు.

దీనిపై స్పందించిన మోడీ.. కరోనా మహమ్మారిపై ఇద్దరం కలిసి పోరాడాల్సిన సమయమిదని.. మిత్రదేశాలకు సాయం చేయడానికి.. తాము సిద్ధంగా ఉన్నామని ట్వీట్ చేశారు.

అటు బ్రెజిల్ అధ్యక్షుడు బోల్సోనారో కూడా ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. దీనికి ప్రతిగా ఈ క్లిష్ట సమయంలో భారత్ - బ్రెజిల్ బంధం బలమైనదని ట్వీట్ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story