వారిలో ధైర్యాన్ని నింపాలి: నారా లోకేష్

పేదలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని నారా లోకేష్ ట్వీట్ చేశారు. లాక్‌డౌన్ కారణంగా పేద ప్రజలు అన్ని విధాలుగా చితికిపోయారని.. ఇప్పుడు మళ్ళీ లాక్‌డౌన్ పొడిగింపు వార్తలు వారిని మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయని పేర్కొన్నారు. ప్రతీ పేద కుటుంబానికీ.. రూ.5 వేలు ఇచ్చి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. పనులు లేవు, తినడానికి తిండి లేదు, ఎక్కడకి కదలలేని పరిస్థితి.. అప్పు పుట్టే అవకాశమే లేదు. ఇలాంటి సమయంలో జగన్ గారు ఆదుకోవాలని సూచించారు.
అటు రైతుల కష్టాలు కూడా వర్ణనాతీతమని.. మద్దతు ధర, రవాణా సౌకర్యం లేక.. లాక్ డౌన్ దెబ్బకి పండిన పంట పొలాల్లోనే వదిలేస్తున్నారని తెలిపారు. దీనికి తోడు అకాల వర్షాలు రైతుల నడ్డి విరుస్తున్నాయని ట్వీటర్ లో తెలిపారు. జిల్లాల్లో జరిగిన పంట నష్టాన్ని ప్రభుత్వం అంచనా వేసి.. నష్ట పరిహారం చెల్లించి.. వారిలో ధైర్యాన్ని నింపాలి’’ అని నారా లోకేష్ ట్వీట్‌లో పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com