కరోనా సెంటర్ గా మారిన వర్లీ స్టేడియం

కరోనా సెంటర్ గా మారిన వర్లీ స్టేడియం

దేశంలో కరోనా వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఇక ముంబైలో కరోనా అనుమానిత కేసులు పెరుగుతున్నాయి. గురువారం రోజున మ‌హారాష్ట్ర‌లో కొత్త‌గా 162 కేసులు న‌మోదు అయ్యాయి. ఒకే రోజు ఇన్ని కేసులు న‌మోదు కావ‌డం ఇదే అత్య‌ధికం. కరోనా కారణంగా ఇప్ప‌టి వ‌ర‌కు 1297 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. ముంబైలోనే అత్య‌ధిక కేసులు బ‌య‌ట‌ప‌డుత‌న్నాయి. ఈ కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపడుతోంది. దీనిలో భాగంగా ముంబైలోని వ‌ర్లీలో ఉన్న ఎన్ఎస్‌సీఐ స్టేడియాన్ని క్వారెంటైన్ సెంట‌ర్‌గా మార్చారు. క‌రోనా వైర‌స్ సోకిన పేషెంట్ల‌కు ప్రాథ‌మిక చికిత్స‌ను అందించే రీతిలో స్టేడియాన్ని మార్చేశారు. మైదానాన్ని స్పెష‌ల్ అబ్జ‌ర్వేష‌న్ జోన్ త‌యారు చేస్తున్న‌ట్లు ఆ స్టేడియం నిర్వాహ‌కులు తెలిపారు. అంత‌ర్జాతీయ‌ ప్ర‌మాణాల ప్ర‌కారం సుమారు 300 బెడ్‌ల‌ను రూపొందించారు. బృహ‌న్‌ముంబై మున్సిప‌ల్ కార్పొరేష‌న్ సూచ‌న‌ల మేర‌కు స్టేడియాన్ని క్వారెంటైన్ సెంట‌ర్‌గా మార్చామ‌న్నారు.

Tags

Read MoreRead Less
Next Story