అంతర్జాతీయం

ఉగ్రదాడులు జరిగే ప్రమాదం ఉంది: ఆంటోనియో గుటెరస్

ఉగ్రదాడులు జరిగే ప్రమాదం ఉంది: ఆంటోనియో గుటెరస్
X

కరోనా మహమ్మారి వలన అంతర్జాతీయ శాంతిభద్రతలు దెబ్బతినే అవకాశం ఉందని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ ఆందోళన వ్యక్తం చేశారు. చివరకు సామాజిక అల్లర్లకు దారితీసి.. దాని మీద పోరాడే సామర్థ్యాన్ని దెబ్బతీసే అవకాశం ఉందని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిని ఆయన హెచ్చరించారు. ఇప్పటివరకు ఐక్యరాజ్య సమితి కీలక విభాగమైన భద్రతామండలి కరోనాపై స్పందించలేదు. కానీ.. శుక్రవారం జరిగిన సమావేశం అనంతరం ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భద్రతకు ముప్పుగా గుర్తిస్తూ ఓ మీడియా ప్రకటనను విడుదల చేసింది. అటు.. కరోనా ప్రభావమున్న దేశాలకు సంఘీభావం తెలపారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. కరోనా మహమ్మారి వలన ప్రభుత్వ రంగ సంస్థలు విశ్వసనీయత కోల్పోయి.. ఆర్థిక అస్థిరత్వం ఏర్పడి.. రాజకీయ ఉద్రిక్తతలు నెలకొంటాయని.. దీంతో కొన్నిదేశాల్లో గందరగోళ పరిస్థితులు ఏర్పడతాయని గుటెరస్ అన్నారు. ఈ అనిశ్చిత పరిస్థితులను అవకాశంగా తీసుకొని ఉగ్రవాదులు దాడులకు పాల్పడే ముప్పు పొంచి ఉందని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇది మానవ హక్కుల పరిరక్షణకు తీవ్ర సవాలుగా ప్రమాదముందని అన్నారు. ఈ క్లిష్ట సమయంలో ఐక్యత, సంకల్పం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని పేర్కొన్నారు.

Next Story

RELATED STORIES