మహారాష్ట్రలో మరో 92 కరోనా పాజిటివ్ కేసులు

X
By - TV5 Telugu |11 April 2020 9:47 PM IST
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విస్తరిస్తుంది. శనివారం ఒక్కరోజే కొత్తగా 92 కరోనా పాజిటివ్ నిర్దారణ అయ్యాయని రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1666కి చేరింది. అయితే.. ఇంత స్థాయిలో మహారాష్ట్రలో కరోనా విస్తరిస్తున్నా.. తొమ్మిది జిల్లాల్లో మాత్రం ఒక్క కేసు కూడా నమోదు కాలేదని.. అటు మరో ఎనిమిది జిల్లాల్లో కేవలం ఒక్కొక్కటి మాత్రమే నమోదైనట్టు ప్రభుత్వం వెల్లడించింది. రాష్ట్రంలో కరోనా వేగంగా విజృంభిస్తున్న నేపథ్యంలో కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించిన ప్రాంతాలలో పోలీసు బలగాలను మోహరించారు.
Tags
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com