ఇండియాలో 200 దాటిన కరోనా మరణాలు.. 24 గంటల్లో 37 మంది మృతి

ఇండియాలో 200 దాటిన కరోనా మరణాలు.. 24 గంటల్లో 37 మంది మృతి
X

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ రోజు రోజుకి పెరుగుతుంది. లాక్‌డౌన్ పకడ్బందీగా అమలవుతున్నా కరోనా పాజిటివ్ కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 37 మంది ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం మరణాల సంఖ్య 206 కు చేరింది. 24 గంటల్లో 896 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మొత్తంగా దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 6761కి చేరింది. ఈ వైరస్‌ నుంచి 516 మంది కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పేర్కొంది.

Next Story

RELATED STORIES