Top

ముంబైలో శుక్రవారం ఒక్కరోజే 218 కరోనా కేసులు

ముంబైలో శుక్రవారం ఒక్కరోజే 218 కరోనా కేసులు
X

దేశంలో కరోనా విజృంభిస్తోంది. ఇక ముంబైలో కొవిడ్ -19 కేసులు రోజు రోజుకి పెరుగుతున్నాయి. నగరంలో శుక్రవారం ఒక్కరోజే కొత్తగా 218 పాజిటివ్ కేసులు నమోదయినట్లు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ వెల్లడించింది. గడచిన 24 గంటల్లో ముంబైలో కరోనా బారిన పడి 10 మంది మృతి చెందారు. దీంతో మరణాల సంఖ్య 64కు చేరింది. మరోవైపు మహారాష్ట్రలో 1364 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్క ముంబై నగరంలోనే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 993కు చేరింది. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా కరోనా నుంచి 125 మంది కోలుకున్నారు.

Next Story

RELATED STORIES