మరోసారి పాకిస్థాన్‌కు బుద్ధి చెప్పిన ఇండియన్ ఆర్మీ

భారత్ భద్రతా బలగాలు.. పాకిస్తాన్ చేష్టలకు మరోసారి గట్టి బుద్ది చెప్పాయి. పీఓకేలో ఉగ్రవాదుల రహస్య స్థావరాలను నాశనం చేసి.. పాక్ పై ప్రతీకారం తీర్చుకుంది. భారత సరిహద్దుల్లో ఉగ్రవాదుల స్థావరాలను సాయం చేస్తున్న పాకిస్థాన్‌కు ఇండియన్ ఆర్మీకి.. బోఫోర్స్ ఫిరంగులతో విరుచుకుపడింది. పాక్ డ్రోన్ విమానంపై దాడికి సంబంధించిన వీడియోను భారత ఆర్మీ విడుదల చేసి పాకిస్తాన్ కు హెచ్చరికలు పంపింది. మేము ఉగ్రవాదులు చంపడమే కాదు.. ఎలా చంపామో ప్రపంచానికి చూపిస్తామని పేర్కొంది. నిజానికి బాలకోట్ వైమానిక దాడి తరువాత పాకిస్తాన్ తోక ముడిచింది. అయితే, తాజాగా మళ్ళీ తోక జాడించింది. ఇటీవల ఉత్తర కాశ్మీర్‌లోని కేరన్ సెక్టార్‌లో నియంత్రణ రేఖ వద్ద చొరబడిన ఉగ్రవాదులకు, భారత భద్రతా దళాలకు మధ్య భీకర ఎన్‌కౌంటర్ జరిగింది. ఇందులో భారత సైన్యానికి చెందిన ఐదుగురు జవానులు అమరులయ్యారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. దీంతో పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఉన్న ఉగ్రవాద రహస్య స్థావరాన్ని భారత సైన్యం ఫిరంగులతో ధ్వంసం చేసింది. చాలా రోజులుగా ఈ ప్రాంతంపై దృష్టి పెట్టిన భారత సైన్యం.. ఇప్పుడు బోఫోర్స్ ఫిరంగుల సహాయంతో ఉగ్రవాద రహస్య స్థావరాన్ని ధ్వంసం చేసింది. ఈ దాడిలో భారత సైన్యానికి ఎటువంటి నష్టం జరగలేదు. సాధారణంగా భారత సైన్యం ఇటువంటి దాడులకు సంబంధించిన వీడియోలను విడుదల చేయదు. కానీ ఈసారి ఆర్మీ డ్రోన్ నుండి తీసిన వీడియోను విడుదల చేసింది. పాక్ ఇంకా ఉగ్రవాదులను పంపడం కొనసాగిస్తే ...బాలకోట్ లాంటి దాడులు కొనసాగుతాయని భారత సైన్యం పాకిస్తాన్ కు హెచ్చరిక చేసింది.
RELATED STORIES
Gold and Silver Rates Today : మార్పులేని బంగారం, వెండి ధరలు.. నిన్నటి...
23 May 2022 5:09 AM GMTMercedes-Benz 300 SLR: కారు ధర రూ. 1,108 కోట్లు.. స్పెషాలిటీ ఏంటంటే..?
21 May 2022 12:45 PM GMTGold and Silver Rates Today :షాకిచ్చిన బంగారం, వెండి ధరలు..ఈరోజు ఇలా...
21 May 2022 12:45 AM GMTGermany Metro Stores: బిజినెస్ బాలేదు.. ఇండియాలో 'మెట్రో' క్లోజ్ ..
20 May 2022 11:00 AM GMTGold and Silver Rates Today : పెరిగిన బంగారం, తగ్గిన వెండి ధరలు.....
20 May 2022 12:45 AM GMTRatan Tata: నానో కారులో రతన్ టాటా.. నిరాడంబరతకు నిలువెత్తు రూపం..
19 May 2022 9:45 AM GMT