ఆ జాబితాలోకి చైనా ఎలా వస్తుంది.. చైనాని టార్గెట్ చేసిన ట్రంప్

ఆ జాబితాలోకి చైనా ఎలా వస్తుంది.. చైనాని టార్గెట్ చేసిన ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. చైనాను టార్గెట్ చేస్తూ మరోసారి విమర్శలు గుప్పించారు. కొన్ని దేశాలను అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలో ఉంటూ చాలా లబ్ది పొందుతున్నాయని అన్నారు. ఇలాంటి వాటిలో చైనా ఉందని.. అభివృద్ధి చెందుతున్న దేశం పేరుతో.. అమెరికా సహా ఇతర దేశాల నుంచి చైనా చాలా వరకు లబ్ది పొందుతోందని అన్నారు. చైనా అభివృద్ధి చెందుతున్న దేశమే అయితే.. అమెరికా కూడా ఆ జాబితాలోకి వస్తుందని అన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్ ను చెప్పుకోవచ్చు అని అన్నారు. అమెరికా బాగా అభివృద్ధి చెందిన దేశమని.. అందులో ఎటువంటి అనుమానం అవసరం లేదని ఆయన అన్నారు. అలాగే చైనా కూడా బాగా అభివృద్ధి చెందిందని అన్నారు. కానీ.. అభివృద్ధి చెందుతున్న దేశంగా చెప్పుకొని.. లాభం పొందటం సరికాదని ట్రంప్ స్పష్టం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story