కరోనాపై పోర్టల్ ఆవిష్కరించిన కేంద్రమంత్రి

కరోనాపై పోర్టల్ ఆవిష్కరించిన కేంద్రమంత్రి
X

కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ ఆదివారం ‘యుక్తి’ వెబ్-పోర్టల్‌ను ప్రారంభించారు. కరోనాకు సంబంధించి.. ఈ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న కార్యక్రమాల వివరాలను విద్యా సంస్థలు, విద్యార్థులకు ఈ పోర్టల్ ద్వారా అందిస్తారు.

యుక్తి -వైయుకేటీఐ - యంగ్ ఇండియా కంబాటింగ్ కోవిడ్ విత్ నాలెడ్జ్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్. విజ్ఞానం, సాంకేతిక పరిజ్ఞానం, నవ కల్పనలతో కోవిడ్‌పై పోరాడుతున్న యువ భారతం అనే అర్థం వచ్చే విధంగా ఈ పోర్టల్ పేరును రూపొందించారు. ఇది ప్రభుత్వానికి, విద్యా సంస్థలకు, విద్యార్థులకు మధ్య వారథిగా ఉపయోగపడుతుందన్నారు. విద్యా రంగంలోని వారినందరినీ శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండేలా చూడటమే తమ ప్రథమ కర్తవ్యమని తెలిపారు.

Next Story

RELATED STORIES