లాక్డౌన్ మంచి నిర్ణయం: ఎన్నారై డాక్టర్

లాక్డౌన్ మంచి నిర్ణయం: ఎన్నారై డాక్టర్

బ్రిటన్‌లో కరోనా బాధితుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో ఆసుపత్రులన్నీ కరోనా రోగులతో నిండిపోయాయంటున్నారు ఎన్నారై డాక్టర్ ఒకరు. కేసులు మరింత పెరిగితే వైద్య సేవలు అందించడం కూడా కష్టమవుతుందని అంటున్నారు. అక్కడ ఫిబ్రవరి నుంచే కరోనా కేసులు వెలుగు చూసినా ప్రభుత్వం అంతగా పట్టించుకోలేదు. దీంతో మార్చికల్లా కేసుల సంఖ్య ఎక్కువవడం మొదలైంది. తాను పని చేసే ఆసుపత్రి ఎన్‌హెచ్ఎస్‌లోనే రోజుకి 50 నుంచి 60 వరకు కరోనా మృతులు వుంటున్నాయని తెలిపారు. అయితే వ్యాధి తీవ్రత మే నెలాఖరు తగ్గే అవకాశాలుంటాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా భారత్‌లో లాగా లాక్డౌన్ ప్రకటించలేకపోతోంది బ్రిటీష్ ప్రభుత్వం. అయితే వైరస్ వ్యాప్తి విస్తృతమవుతున్నందున ప్రజలు ఎక్కువ శాతం మంది ఇళ్లకే పరిమితమవుతున్నారని తెలిపారు. ప్రస్తుతం ఈస్టర్ శెలవులు వుండడంతో విద్యాసంస్థలు, కొన్ని కార్యాలయాలు మూతపడ్డాయి. దాంతో కొంత డెత్ రేట్ కానీ, పాజిటివ్ కేసుల సంఖ్య కానీ తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఇక లాక్డౌన్ ప్రకటిస్తే ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందని వాదించే వారు లేకపోలేదు. అయితే భారత్ లాక్డౌన్ విధించి మంచి పని చేసిందని అంటున్నారు. ఆధునిక వైద్య సౌకర్యాలు ఉన్న బ్రిటన్‌లోనే పరిస్థితి ఇలా వుంటే.. ఇక భారత్ పరిస్థితి ఊహించడానికే కష్టంగా వుండేది లాక్డౌన్ విధించకపోతే అని ఆయన అంటున్నారు. ప్రజలు, ప్రభుత్వాలు ఏ మాత్రం అప్రమత్తంగా ఉన్నా చైనా, ఇటలీ తరహాలో భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుందని డాక్టర్ చెబుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story