ఈ ఏడు పాటిస్తే.. కరోనాపై విజయం సాధించినట్లే: ప్రధాని మోదీ

ఈ ఏడు పాటిస్తే.. కరోనాపై విజయం సాధించినట్లే: ప్రధాని మోదీ

దాదాపు 21 రోజుల్నించి నా మాట మీద గౌరవం ఉంచి అందరూ ఇంట్లో ఉన్నారు. ధన్యవాదాలు. అలాగే ఇంకో 19 రోజులు లాక్డౌన్ పాటిస్తే వైరస్‌ వ్యాప్తిని చాలా వరకు రూపుమాపగలుగుతాం. మే 3 వరకు మీరు ఇంట్లోనే ఉండి మీ ఆరోగ్యాలను కాపాడుకోండి అని ప్రధాని మోదీ జాతిని ఉద్దేశించి పిలుపునిచ్చారు. అలాగే కరోనాపై విజయం సాధించాలంటే ఈ ఏడు సూత్రాలు పాటించండి అంటూ వాటి గురించి వివరించారు. వీటిని కనుక కచ్చితంగా అమలు చేస్తే కరోనాపై విజయం సాధిస్తామని ఆయన అన్నారు.

కుటుంబంలోని చిన్న పిల్లలు వృద్ధుల పట్ల జాగ్రత్త వహించాలి. ప్రతి వ్యక్తి భౌతిక దూరం పాటించాలి. లాక్డౌని అతిక్రమించొద్దు.

ఇంట్లో తయారు చేసుకున్న మాస్కులను వాడుతూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి.

రోగ నిరోధకశక్తి పెంచుకునే ఆహారాన్ని తీసుకోవాలి. తరచూ వేడి నీళ్లు తీసుకుంటే వైరస్ దరి చేరదు.

మీ ఫోన్లలో ఆరోగ్య సేతు యాప్‌ని డౌన్ లోడ్ చేసుకుని ఎప్పటికప్పుడు వారందించే ఆరోగ్య సమాచారం తెలుసుకోవాలి.

లాక్డౌన్ కారణంగా పేదలు, నిర్భాగ్యులు ఆకలితో అలమటించకుండా మీ వంతు సహాయం చేయండి.

ఇక ప్రైవేటు సంస్థలు, పరిశ్రమల్లోంచి ఉద్యోగులను తొలగించొద్దు.

కరోనా బాధితులకు నిరంతరం సేవ చేస్తూ వారి ప్రాణాలను ఫణంగా పెట్టి వైద్యం అందిస్తున్న వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసుల పట్ల గౌరవ భావంతో ఉండాలి.

Tags

Read MoreRead Less
Next Story