గుజరాత్ సీఎంకు కరోనా నెగిటివ్

గుజరాత్ సీఎంకు కరోనా నెగిటివ్
X

కరోనా పరీక్షలు జరిపించుకున్న గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీకి ఎలాంటి కోవిడ్ లక్షణాలు లేవని వైద్యులు తేల్చారు. ఆయన పూర్తి సామర్థ్యంతో, ఆరోగ్యంగా ఉన్నట్టు వైద్యులు ధ్రువీకరించారని ముఖ్యమంత్రి కార్యదర్శి అశ్వని కుమార్ మీడియాకు తెలిపారు.

సీఎం విజయ్ రూపానీ ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి సమావేశానికి హాజరైన ఒక ఎమ్మెల్యేకు కరోనా సోకిందని తేలింది. దీంతో ముందు జాగ్రత్త చర్యగా విజయ్ రూపానీకి స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయారు. తన ఇంట్లోనే ఉంటూ, వీడియో కాన్ఫరెన్స్, టెలిఫోన్ ద్వారా తన విధులను నిర్వహిస్తున్నారు. దీంతో కరోనా పరీక్షలు చేసిన డాక్టర్లు ఆయనకు ఎలాంటి కరోనా లక్షణాలు లేవని నిర్ధారించారు.

Next Story

RELATED STORIES