గడిచిన 24 గంటల్లో 1,211 కొత్త కరోనా కేసులు

X
TV5 Telugu14 April 2020 6:58 PM GMT
గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 1,211 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన కేసులతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 10,363కు చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. అయితే.. గత 24 గంటల్లో 117 మంది డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు. ఇప్పటివరకూ 1036 మంది డిశ్చార్జ్ అయ్యారని ప్రకటించింది. గడచిన 24 గంటల్లో కరోనాతో 31 మంది చనిపోగా.. మొత్తం మృతుల సంఖ్య 339 మందికి చేరిందని తెలిపారు.
కరోనా కట్టడికి మే 3 వరకు లాక్‌డౌన్ పొడిగించిన విషయం తెలిసిందే.
Next Story