లాక్‌డౌన్.. పరిమితులకు లోబడి కొన్ని అనుమతులు

లాక్‌డౌన్.. పరిమితులకు లోబడి కొన్ని అనుమతులు
X

అందరూ ఇంట్లో కూర్చుంటే ఎలా.. కొందరు పని చేయక తప్పదు.. వాళ్లైనా కొన్ని పరిమితులకు లోబడి మాత్రమే పని చేయాల్సి ఉంటుంది అని కేంద్ర ప్రభుత్వం కొన్ని గైడ్‌లైన్స్ రూపొందించింది. ఇందులో భాగంగానే అన్ని రవాణా సంస్థలను రద్దు చేసింది. కొన్ని రంగాలు ఈ నెల 20 నుంచి మినహాయింపు ఇచ్చింది.

వ్యవసాయ ఉత్పత్తుల సేకరణకు, క్రయ విక్రయాలకు అనుమతి

అత్యవసర వైద్యం కోసం తప్పించి సరిహద్దు దాటడానికి అనుమతి లేదు

అంత్యక్రియలకు 20 మందికి మించి హాజరు కాకూడదు

దేవాలయాలు, ప్రార్ధనా మందిరాలకు, దైవ ప్రసంగాలు వంటి వాటికి అనుమతి లేదు.

పాల పరిశ్రమలు, పౌల్ట్రీ ఉత్పత్తులను కొనసాగించవచ్చు

ఉపాధి హామీ పనులు చేసుకోవచ్చు, ఆక్వా ఉత్పత్తుల అమ్మకాలు సాగించొచ్చు

రాష్ట్ర ప్రభుత్వ ఆద్వర్యంలోని వ్యవసాయ మార్కెట్ల కార్యకలాపాలకు అనుమతి

వ్యవసాయానికి సంబంధించిన పనిముట్ల దుకాణాలు తెరిచేందుకు అనుమతి

అద్దెకు ఇచ్చే వ్యవసాయ యంత్ర పరికరాల సంస్థకు అనుమతి

వ్యవసాయానికి సంబంధించిన ఎరువులు, పురుగుమందుల దుకాణాలు తెరిచేందుకు అనుమతి

బ్యాంకులన్నీ యథాతథంగా పనిచేస్తాయి

అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాల నిర్వహణ కొనసాగుతుంది

దాబాలు, వెహికల్ రిపేర్ సెంటర్లు పని చేస్తాయి

ఇక రద్దీ ఎక్కువ శాతం ఉంటే సినిమా హాళ్లు, మాల్స్, జిమ్‌లు, స్పోర్ట్స్ కాంప్లెక్సులకు అనుమతి లేదు

అయితే వైరస్ వ్యాప్తి తీవ్రతను గుర్తించి కొన్ని ఏరియాల్లో రెడ్ జోన్ పెట్టారు. అక్కడ మాత్రం ఎలాంటి వాటికీ అనుమతి లేదు. నిత్యావసరాల పంపిణీ మాత్రం జరుగుతుంది. జిల్లాల వారీగా హాట్ స్పాట్ జోన్లను, వాటి కోసం ప్రత్యేక మార్గదర్శకాలను కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేయనుంది.

Next Story

RELATED STORIES