రూ. 20 కోట్ల విరాళం ఇచ్చిన యూపీ పోలీసులు

రూ. 20 కోట్ల విరాళం ఇచ్చిన యూపీ పోలీసులు

కరోనా మహమ్మారి కట్టడికి జరుగుతున్న పోరులో భార‌త దేశానికి అనేక సంస్థ‌లు మ‌ద్ద‌తుగా నిలుస్తున్నాయి. ఇందుకోసం పెద్ద‌మొత్తంలో పీఎంకేర్స్‌కు విరాళాలు అంద‌జేస్తున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌ పోలీసులు ఉదార స్వభావాన్ని చాటుకున్నారు. కరోనాపై పోరులో సామాన్యులకు రక్షణ కవచంలా ముందుండి నడిపిస్తున్న పోలీసులు ఉత్తరప్రదే రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 20 కోట్ల విరాళం ఇచ్చారు. సీఎం సహాయనిధికి యూపీ పోలీసులు, ప్రావిన్సియల్‌ ఆర్మ్‌డ్‌ కాన్‌స్టేబులరీ(పీఏసీ) విభాగం పోలీసులు కలిసి రూ. 20 కోట్ల విరాళం ఇచ్చారు. ఈ చెక్కును సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు యూపీ డీజీపీ అందజేశారు.

కొవిడ్‌-19 కేర్‌ ఫండ్‌కు యూపీ పోలీసులు, పీఏసీ విభాగం రూ. 20 కోట్ల విరాళం ఇవ్వడం మంచి పరిణామం అని సీఎం యోగి తెలిపారు. యూపీ ప్రజల ఆరోగ్యం, సంక్షేమం కోసం ఈ నిధులను సమకూర్చిన పోలీసులకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని యోగి పేర్కొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story