రూ.12 ల‌క్ష‌ల విలువైన మాస్కులు సీజ్‌ చేసిన అధికారులు

రూ.12 ల‌క్ష‌ల విలువైన మాస్కులు సీజ్‌ చేసిన అధికారులు

కరోనా.. ఈ పేరు వింటే చాలు ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. కరోనా మహమ్మారి కారణంగా ప్రజలంతా ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని ఇళ్లలోనే గడపుతున్నారు. ఇలాంటి సమయంలో కూడా ప్రజల అవసరాలను డబ్బు చేసుకోవాలని కక్కుర్తి పడుతున్నారు కొందరు వ్యాపారులు. ఫేస్ మాస్కులు, శానిటైజర్లు దాచేసి, మార్కెట్లో కొరత సృష్టిస్తున్నారు. ఆ తర్వాత నెమ్మదిగా తమ వద్ద ఉన్న వస్తువులను మార్కెట్లో అధిక ధరలకు అమ్ముకోవాలనేదే వారి పథకం. సరిగ్గా ఇలాంటి పథకంతోనే అక్ర‌మంగా నిల్వ చేసిన మాస్కులను ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ధ‌ర‌విలో ఫేస్ మాస్కుల‌ను నిల్వ ఉంచార‌న్న స‌మాచారంతో ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు త‌నిఖీలు నిర్వ‌హించారు. నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా ఫేస్ మాస్కు స్టాక్ ను ఉంచిన వ్య‌క్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సదరు వ్యక్తి నుంచి 81 వేల త్రీ-ప్లై స‌ర్జిక‌ల్ మాస్కుల‌ను స్వాధీనం చేసుకున్నారు. ఫేస్ మాస్కుల ధర రూ.12,15,000 ఉంటుంద‌ని పోలీస్ అధికారులు వెల్లడించారు.

Tags

Read MoreRead Less
Next Story