కరోనా కాల్ సెంటర్‌లో పనిచేస్తోన్న టాలీవుడ్‌ హీరోయిన్

కరోనా కాల్ సెంటర్‌లో పనిచేస్తోన్న టాలీవుడ్‌ హీరోయిన్
X

టాలీవుడ్ హీరోయిన్ ప్రస్తుతం కరోనా కాల్ సెంటర్‌లో పనిచేస్తున్నారు. పేద ప్రజలకు నిత్యావసరాలను సరఫరా చేయడానికి సర్కార్ కాల్ సెంటర్ ఏర్పాటు చేసింది. ఈ కాల్ సెంటర్‌లో పనిచేస్తున్నారు ఆ హీరోయిన్. ప్రజలు చేస్తోన్న ఫోన్ కాల్స్‌ను రిసీవ్ చేసుకుని వారికి కావాల్సిన మెడిసిన్స్, ఇతర నిత్యావసరాల జాబితాలను తయారు చేస్తున్న ఆ హీరోయిన్ మరో ఎవరో కాదు మలయాళ కుట్టి నిఖిలా విమల్.

తెలుగులో మేడమీద అబ్బాయి, గాయత్రి వంటి మూవీలో ఆమె నటించారు. తరువాత మలయాళంలో వరుసపెట్టి సినిమాలు చేశారు. ప్రస్తుతం దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్ అమలు చేస్తోంది. ఈ సమయంలో పేద ప్రజలకు నిత్యావసరాలను సరఫరా చేయడానికి కేరళలోని కన్నూర్ జిల్లా పంచాయతీ కార్యాలయంలో కాల్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఈ కాల్ సెంటర్‌లో తన సేవలు అందిస్తున్నారు నిఖిలా విమల్.

Next Story

RELATED STORIES