ఐరోపాలో పది లక్షలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు

ఐరోపాలో పది లక్షలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు
X

కరోనా వైరస్ ఐరోపాలో కలకలం సృష్టిస్తోంది. ఈ ప్రాణాంతక వైరస్‌ ఐరోపా దేశాలను అతలకుతలం చేస్తోంది. ఇప్పటి వరకు ఐరోపాలో పది లక్షలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఇటలీ, ఫ్రాన్స్‌, స్పెయిన్‌లు ప్రపంచ వ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్యలో తొలి నాలుగు స్థానాల్లో ఉన్నాయి. ఐరోపాలో ఇప్పటివరకు 10,03,284 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు కరోనా బారిన పడి 84,465 మంది మృతి చెందారు. ఈ కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటివరకు స్పెయిన్‌లో 18255 మంది, ఇటలీలో 21,067 మంది, ఫ్రాన్స్‌లో 15,729 మంది, జర్మనీలో 3495 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచవ్యాప్తంగా 20,08,251 కేసులు నమోదయ్యాయి. 1,27,168 మంది మృతి చెందారు.

Tags

Next Story