కరోనాపై పోరాటం చేస్తున్న వారికి ప్రభుత్వం భరోసా కల్పించాలి: సీపీఐ రామకృష్ణ

కరోనాపై పోరాటం చేస్తున్న వారికి ప్రభుత్వం భరోసా కల్పించాలి: సీపీఐ రామకృష్ణ

కరోనాపై పోరాటం చేస్తున్న వారికి ప్రభుత్వం భరోసా కల్పించాలని సీపీఐ రామకృష్ణ డిమాండే చేశారు. కరోనా విధుల్లో ఉన్న వైద్యులు, నర్సులు, పోలీసులు, మున్సిపల్ సిబ్బంది, మీడియా ప్రతినిధులకు ప్రభుత్వం అండగా ఉండాలని.. ఇరవై లక్షల జీవిత భీమాతో పాటు, అదనంగా పది‌వేల రూపాయలు వారికీ ఇవ్వాలని ఆయన కోరారు. కరోనాపై ప్రత్యక్షముగా యుద్ధం చేస్తున్న వైద్యులు, నర్సులు సరైన సౌకర్యాలు ఏర్పాటు చేయకపోవడం వల్ల వారికి కరోనా సోకిందన్నారు

అటు.. ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఏడాది వరకూ ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టేందుకు 5.30 కోట్ల టన్నుల ఆహార ధాన్యాల నిల్వలు ఉన్నాయని.. అయినా.. లక్షల మంది కార్మికులు పస్తులు ఉంటున్నారని విమర్శిచారు. ప్రతి పేదవాడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరో రూ.5 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతులు కష్టపడి పండించి పంటను అమ్ముకునే పరిస్థితి లేదన్నారు. అప్పులు తెచ్చి సాగు ‌చేసిన రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story