తాజా వార్తలు

తెలంగాణలో కరోనా పరిస్థితులపై సీఎం కేసీఆర్‌ సమీక్షసమావేశం

తెలంగాణలో కరోనా పరిస్థితులపై సీఎం కేసీఆర్‌ సమీక్షసమావేశం
X

తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకి పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సర్కార్ లాక్ డౌన్ పొడిగించింది. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, లాక్‌డౌన్‌ అమలు తదితర విషయాలపై సీఎం కేసీఆర్‌ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశానికి వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డితో పాటు పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. లాక్‌డౌన్‌ పొడిగింపు నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇప్పుడు రాష్ట్ర సర్కార్ కూడా ప్రత్యేక మార్గదర్శకాలను రిలీజ్ చేసే అవకాశం ఉంది.

Next Story

RELATED STORIES