కరోనా పరీక్షలు బాగా పెరగాలి. అప్పుడే.. : రాహుల్ గాంధీ

కరోనా పరీక్షలు బాగా పెరగాలి. అప్పుడే.. : రాహుల్ గాంధీ

కరోనా మహమ్మారిని అడ్డుకోవడానికి లాక్‌డౌన్ కొన్ని రోజులు మాత్రమే వినియోగపడుతుందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. పూర్తిస్థాయిలో కరోనాని ఎదుర్కోవాలంటే రాండమ్ గా, వ్యూహాత్మకంగా పరీక్షలను నిర్వహించాలని అన్నారు. కానీ, లాక్‌డౌన్ ఒక్కటే పరిష్కారం ఏమాత్రం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పటివరకు దేశంలో చాలా తక్కువ కరోనా పరీక్షలు జరిగాయని.. వెంటనే ఆ సంఖ్యను పెంచాలని రాహుల్ డిమాండ్ చేశారు. కరోనా ప్రభావం ఆధారంగా దేశంలో అన్ని ప్రాంతాలను హాట్ స్పాట్, నాన్ హాట్ స్పాట్ అని రెండు జోన్లుగా విభజిస్తే బాగుంటుందని సూచించారు.

రాష్ట్రాలకు నిధులు మంజూరు చేసి.. తద్వారా కరోనా పరీక్షల సంఖ్య పెరిగేలా కేంద్రం చర్యలు తీసుకోవాలని అన్నారు.ఎక్కువగా పరీక్షలు జరిగితే.. కరోనా వ్యాప్తి ఏ ప్రాంతంలో ఉంది.. ఎవరి మీద ఎక్కువగా ఉందనేది అంచానా వేయవచ్చు అని ఆయన తెలిపారు. తాను ప్రభుత్వాన్ని విమర్శలు చేయడం లేదని.. కేవలం సలహాలు, సూచనలు మాత్రమే ఇస్తున్నానని ఆయన స్పష్టం చేశారు. రాజకీయాలు పక్కన పెట్టి అన్ని పార్టీలు కూడా కలిసి కరోనా మీద పోరాటం చేయాల్సి ఉందని రాహుల్ సూచించారు. .

Tags

Read MoreRead Less
Next Story