హాస్పిటల్ వాష్‌రూమ్‌లో తిష్ట వేసుకుని కూర్చున్న చిరుత

హాస్పిటల్ వాష్‌రూమ్‌లో తిష్ట వేసుకుని కూర్చున్న చిరుత
X

దేశంలో లాక్‌డౌన్ కారణంగా జనాలు బయటకు రాకపోవడంతో రోడ్లన్ని నిర్మానుషంగా మారాయి. దీంతో ఇన్నాళ్లు అడవుల్లో ఉన్న జంతువులు రోడ్లపైకి వస్తున్నాయి. అటవీప్రాంతంలో ఉండాల్సిన చిరుత పట్టణాన్ని వెతుక్కుంటూ వచ్చింది. గుజరాత్‌లోని ఓ హాస్పిటల్ లోకి దర్జాగా ప్రవేశించింది . గాంధీనగర్‌ కోలవాడలో ఉన్న ఆయుర్వేద హాస్పిటల్ లోని వాష్‌రూమ్‌లో తిష్ట వేసుకుని కూర్చుంది. దీంతో హాస్పిటల్ లో ఉన్న సిబ్బంది, రోగులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. ఆస్పత్రి సిబ్బంది ఇచ్చిన సమాచారంతో అక్కడికి అటవీ శాఖ అధికారులు చేరుకున్నారు. మొత్తానికి చిరుతను అటవీశాఖ అధికారులు బంధించి తీసుకెళ్లారు.

Next Story

RELATED STORIES