ఉచిత టీవీ, మొబైల్ సర్వీసులను అందించాలి.. సుప్రీం కోర్టులో పిల్

ఉచిత టీవీ, మొబైల్ సర్వీసులను అందించాలి.. సుప్రీం కోర్టులో పిల్

కరోనా విజృంభిస్తున్న కష్టకాలంలో ప్రజలకు మొబైల్‌ కాలింగ్‌, డేటా,టీవీ సర్వీసులను ఉచితంగా అందించాలంటూ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలైంది. ఈ మేరకు మనోహర్‌ ప్రతాప్‌ అనే వ్యక్తి సర్వోన్నత న్యాయస్థానంలో పిల్‌ దాఖలు చేశారు. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలులో ఉండటంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారని.. ఉపాధి కోల్పోయి రాబడి లేకుండా పోయిందని.. అందుకే వారికి మొబైల్‌, టీవీ సర్వీసులతోపాటు అమెజాన్‌, నెట్‌ ప్లిక్స్‌ వంటి వీడియో స్ట్రీమింగ్‌ వెబ్‌సైట్లు కూడా ఉచితంగా అందించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. లాక్‌డౌన్‌ అమలులో ఉన్నంత వరకు ఉచిత సేవలు అందించేలా ఆయా సంస్థలను ఆదేశించాలని పిటిషనర్‌ న్యాయస్థానాన్ని కోరారు. ఇళ్లకు పరిమితమైన వారికి ఇది ఎంతగానో ఉపయోగపడుతోందని ఆయన పిటిషన్ లో పేర్కొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story