నావికాదళం వారినీ వదలనంటోన్న కరోనా.. భారత నేవీలో..

ఎవరినీ వదిలేది లేదంటూ భారత నావికాదళంలోకీ ఎంటరైపోయింది కరోనా వైరస్. దాదాపు 20 మంది నేవీ సిబ్బందికి కరోనా సోకినట్లు సమాచారం. కరోనా పాజిటివ్ అని తెలిసిన వెంటనే ఐఎన్ఎస్ యాంగ్రీ నివాస స్థావరాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వీరందరినీ ముంబైలోని అశ్వినీ నేవీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తొలిసారిగా నేవీలో కరోనా కేసులు వెలుగు చూడడంతో అప్రమత్తమైన అధికారులు వారితో కలిసిన మరికొంత మందిని గుర్తించే పనిలో పడ్డారు.
అత్యంత పకడ్భందీగా ఉండే ఆర్మీ సైనికుల్ని కరోనా పట్టి పీడిస్తోంది. భారత సైనికా దళంలోని ఇప్పటి వరకు 8 మందికి వైరస్ సోకినట్లు ఆర్మీ చీఫ్ జనరల్ ఎం.ఎం.నవరణే శుక్రవారం ప్రకటించారు. వీరిలో ఇద్దరు వైద్యులు, ఒకరు నర్సు ఉన్నారు. మిగిలిన వారంతా సైనికులు. కరోనా లక్షణాలు కనిపించిన వెంటనే క్వారంటైన్‌లో వుండి చికిత్స తీసుకోవడంతో ప్రస్తుతం వీరంతా కోలుకుంటున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా ప్రజలందరినీ కలవరపెడుతున్న కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో భారత త్రివిధ దళాలు అప్రమత్తమయ్యాయి. అందులో భాగంగానే అత్యవసర చర్యలు మినహా అందరూ ఇంటి దగ్గర నుంచే పనిచేయాలని ఆజ్ఞలు జారీ చేశారు. శిక్షణా కార్యక్రమాలు, సమావేశాలు లాంటివి వాయిదా వేశారు. వైరస్ వ్యాప్తి చెందినా నిరోధించేందుకు ముందస్తు చర్యలు అవలంభిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com