కరోనాని కంట్రోల్ చేసేదెలా.!!

ఎవరికి ఉందో ఎవరికి లేదో.. కరోనాని గుర్తించడం కష్టమైపోతోంది. కరోనా వున్న వ్యక్తితో కలిసిన వ్యక్తులను తీసుకెళ్లి క్వారంటైన్‌లో ఉంచుతున్నారు. 14 రోజుల తరువాత కూడా వ్యాధి లక్షణాలు బయటపడట్లేదు. కొన్నాళ్ల తరవాత కానీ రోగ లక్షణాలు బయటపడుతున్నాయి. ఇదే ఇప్పడు వైద్యులకు పెను సవాల్‌గా మారింది. చైనాలో కూడా వ్యాధి లక్షణాలు బయటపడిన వారినే లెక్కల్లో చూపింది. అయితే ప్రతి నాలుగింట ఒకరు కరోనాను వ్యాప్తి చేస్తున్నట్లు అమెరికా చెబుతోంది. ఇటువంటి కేసులను కనిపెట్టి చికిత్స చేయడం కష్టంగా మారుతోంది.
ఫ్లూ కంటే ప్రమాదకరమైంది కరోనా అని తెలుస్తోంది. ఫ్లూ సోకిన ఐదు రోజుల్లో బయటపడుతుంది. దాంతో చికిత్స తీసుకోవడం కూడా సులువవుతుంది. దీనికి వ్యాక్సిన్ కూడా ఉండడంతో ఈ వ్యాక్సిన్ తీసుకున్న వారికి ఫ్లూ రాదు. ఇక రోగ నిరోధక శక్తి ఉన్న వారిని కూడా ఏమీ చేయదు. కానీ కరోనా అలా కాదు.. 14 రోజుల వరకు దాని లక్షణాలు బయటపడవు. దాంతో ఈ లోపు ఎవరినీ కలిసినా వారికి వచ్చే అవకాశం ఉంటుంది. పైగా దీనికి వ్యాక్సిన్ కూడా లేకపోవడం, ప్రజల్లో రోగ నిరోధక శక్తి అభివృద్ధి చెందక పోవడంతో రోగి పరిధిలో ఉన్న వారందరికి ఈ వైరస్ సోకే ప్రమాదం ఉంది. ఫ్లూ పది దశలు దాటాక 56 మంది సోకే అవకాశం ఉంటే.. కోవిడ్ పది దశల్లో 2047 మందికి సోకుతుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com