అక్కడ కరోనా దాడి కంటే.. పోలీసుల దాడులతోనే ఎక్కువ మరణాలు

కరోనా మహమ్మారిని అడ్డుకోవడాని ప్రపంచదేశాలు పోరాటం చేస్తున్నాయి. ఈ మహమ్మారి బారి నుంచి బయటపడటానికి మందు లేకపోవడంతో.. చాలా దేశాలు లాక్ డౌన్ అమలు చేశాయి. దీని వలన కొన్ని ప్రాంతాలలో పోలీసులు సామాన్య ప్రజానీకం పై దురుసుగా ప్రయత్నిస్తున్నారు. కొన్ని ప్రాంతాలలో పోలీసుల చర్యలతో పలువురు ప్రాణాలు కొల్పోతున్నారు. నైజీరియాలో ఇప్పటివరకు లాక్ డౌన్ కారణంగా 18 మంది ప్రాణాలు కోల్పోయారు. లాక్ డౌన్ నిబంధనలను అతిక్రమించినందుకు పోలీసులు, ఇతర భద్రతా దళాలు 18 మందిని అంతమొందించినట్లు డైలీ మెయిల్ తెలిపింది. ఇక్కడ కరోనా మృతుల కంటే లాక్ డౌన్ మృతులు ఎక్కువగా ఉండటం బాధాకరం. ఈ సంఘటన జరిగే సమయానికి కరోనా వైరస్ కారణంగా నైజీరియాలో 12 మంది మాత్రమే మరణించారు. అయితే.. ఇప్పుడు అక్కడ కరోనా మృతుల సంఖ్య 17 కి చేరింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలను సాధారణ పౌరులు జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు పంపించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com