మరోసారి నితీష్ కుమార్ పై మండిపడ్డ ప్రశాంత్ కిషోర్

మరోసారి నితీష్ కుమార్ పై మండిపడ్డ ప్రశాంత్ కిషోర్

రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్.. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పై మరోసారి ట్వీటర్ వేదికగా విమర్శలు చేశారు. రాజస్థాన్ లో చిక్కుకున్న తమ విద్యార్థులను సొంత రాష్ట్రానికి తీసుకొచ్చెనందుకు యూపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను తప్పుపట్టిన బీహార్ సీఎం నితీష్ కుమార్ పై ప్రశాంత్ కిషోర్ మండిపడ్డారు.

లాక్‌డౌన్ కారణంగా బీహార్‌ కు చెందిన విద్యార్థులు దేశవ్యాప్తంగా పలు చోట్ల చిక్కిపోయి అవస్థలు పడుతుంటే.. నితీష్ కుమార్ కు మాత్రం అది పెట్టడంలేదని.. లాక్‌డౌన్ గురించి ఉపన్యాసాలు దంచడంలో ఆయన బిజీగా ఉన్నారంటూ ప్రశాంత్ కుమార్ ఓ ట్వీట్‌లో విమర్శలు సంధించారు.

ప్రతి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇతర రాష్ట్రాలలో చిక్కుకున్న తమ రాష్ట్ర ప్రజల యోగక్షేమాల గురించి ఆలోచిస్తున్నాయి. వారిని సొంత రాష్ట్రానికి రప్పించే ప్రయత్నాలు చేస్తున్నాయి. కానీ.. నితీష్ మాత్రం వాళ్ళ గురించి మాట్లాడే ప్రయత్నం చేయటం లేదు. ప్రధాని మోదీతో జరిపిన సమావేశంలోనూ నితీష్ ఆ ప్రస్తావనే చేయలేదని పీకే ఆరోపించారు.

కాగా.. రాజస్థాన్ లో చిక్కుకున్న 8,000 మంది తమ విద్యార్థులను వెనక్కి రప్పించేందుకు 250కి పైగా బస్సులను ఆగ్రా, ఝాన్సీలకు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం పంపింది. యోగి ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రయత్నాలను నితీష్ తప్పుపట్టారు. ఈ చర్య వల్ల లాక్‌డౌన్ ఉద్దేశ్యం దెబ్బతింటుందని నితీష్ విమర్శించారు.

Tags

Read MoreRead Less
Next Story