Top

కానిస్టేబుల్‌కు క‌రోనా పాజిటివ్‌..

కానిస్టేబుల్‌కు క‌రోనా పాజిటివ్‌..
X

దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో మరో పోలీసుకు కరోనా వైరస్ సోకింది. ఢిల్లీలోని చాందిని మ‌హ‌ల్ పోలీస్ స్టేష‌న్ లో విధులు నిర్వ‌ర్తిస్తున్న స‌ద‌రు కానిస్టేబుల్ కు ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా..క‌రోనా పాజిటివ్ గా నిర్దార‌ణ అయింది. దీంతో కానిస్టేబుల్ కుటుంబ‌స‌భ్యులంద‌రినీ హోం క్వారంటైన్ లో ఉండాల‌ని, బ‌య‌ట‌కు రావొద్ద‌ని పోలీస్ ఉన్న‌తాధికారులు సూచ‌న‌లు చేశారు. కానిస్టేబుల్ తో స‌న్నిహితంగా ఉన్న ఇత‌ర వ్య‌క్తులకు కూడా క్వారంటైన్ లో ఉండాల‌ని సూచించిన‌ట్లు చాందిని మ‌హ‌ల్ ఎస్‌హెచ్ వో పోలీస్ ఉన్న‌తాధికారి తెలిపారు. కానిస్టేబుల్ కుటుంబానికి అవ‌స‌ర‌మైన నిత్య‌వ‌స‌ర స‌రుకులు ఇంటివ‌ద్ద‌కే పంపిస్తాం అని తెలిపారు.

Next Story

RELATED STORIES