వూహాన్‌ నుంచి కాదా కరోనా వచ్చింది.. మరి?

వూహాన్‌ నుంచి కాదా కరోనా వచ్చింది.. మరి?

కనిపించిన జంతువునల్లా కరకరా నమిలేస్తే కరోనా రాక ఛస్తుందా అని ఇప్పటి వరకు అందరూ అనుకుంటున్నారు. మరి చైనా మార్కెట్ల నిండా జంతువులు, పక్షులు, పాములు, చీమలు కనిపిస్తాయి. చైనాలోని ప్రధాన నగరం వూహాన్. ఇక్కడ ప్రపంచంలోనే అతిపెద్ద మాంసాహార మార్కెట్ ఉంది. ఇక్కడ మాంసాన్ని కొనుగోలు చేసిన వ్యక్తి ద్వారా కరోనా వచ్చిందని అందరూ అనుకుంటున్న నిజం.

కానీ తాజాగా ఫ్యాక్స్ ఓ నివేదిక వెల్లడించింది. అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారాన్ని సేకరించిన ఈ నివేదికలో తెలిపిన ప్రకారం.. ఈ వైరస్‌కు నిలయమైన గబ్బిలాలపై వూహాన్ లేబరేటరీలో పరిశోధన చేస్తున్నారు కొంతమంది సైంటిస్టులు. ల్యాబ్‌లో పని చేసే ఓ మహిళా ఉద్యోగికి ఈ వైరస్ సోకింది. సరైన ప్రమాణాలు పాటించకపోవడంతో ఆమెకు వైరస్ సోకింది. ఆ విషయం తెలియక ఆమె తన బాయ్‌ఫ్రెండ్‌ని కలవడానికి వెళ్లింది.

అతడు మార్కెట్‌కి వెళ్లి దాన్ని మరికొంత మందికి అంటించాడు. దాంతో ఇది దావానంలా విస్తరించి ఒకరి నుంచి మరొకరికి అలా వందలు, వేలు దాటి ప్రపంచం మొత్తం పాకింది. అయితే ఫ్యాక్స్ నివేదికలో పొందుపరిచిన విషయాల గురించి అమెరికా అధినేత ట్రంప్ దగ్గర ప్రస్తావించగా దాన్ని ఆయన సమర్ధించనూ లేదు.. అలా అని వ్యతిరేకించనూ లేదు. మరింత లోతుగా అధ్యయనం చేస్తున్నాం అని ఆయన సమాధానం చెప్పారు.

కరోనా వైరస్‌పై పరిశోధనలు కొనసాగిస్తున్న ఈ ల్యాబ్ మాంసాహార విక్రయశాలకు దగ్గరలో ఉంది. ల్యాబ్ యొక్క ప్రమాణాల గురించి రెండేళ్ల కిత్రమే చైనాను.. యూఎస్ ఎంబసీ హెచ్చరించినట్లు ఇటీవల వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది. కానీ ఆ విషయాలేవీ అధ్యక్షుడు ట్రంప్ ప్రస్తావించదలచుకోలేదు.

Tags

Read MoreRead Less
Next Story