కరోనాతో మృతి చెందిన ఏసీపీ.. ఆయన భార్యకీ..

కరోనాతో మృతి చెందిన ఏసీపీ.. ఆయన భార్యకీ..
X

ప్రజల ప్రాణాలు కాపాడే నిమిత్తం తమ ప్రాణాలు ఫణంగా పెడుతున్న వైద్య సిబ్బంది, పోలీసులూ కరోనా కాటుకు బలవుతున్నారు. తాజాగా పంజాబ్ లుథియానాలో డ్యూటీ నిర్వహిస్తున్న పోలీస్ అధికారి ఏసీపీ అనిల్ కుమార్ కోహ్లీ (52)కి కరోనా లక్షణాలు కనిపించడంతో టెస్ట్ చేశారు. ఏప్రిల్ 13న కరోనా పాజిటివ్ అని రిపోర్ట్ వచ్చింది. దాంతో అతడిని సద్గురు ప్రతాప్ సింగ్ ఆసుపత్రిలో చేర్చారు. ప్లాస్మా థెరపీతో చికిత్స చేయాలని వైద్యులు భావించారు. కానీ అప్పటికే అతడి శరీరంలోని ఇతర భాగాలు చెడిపోయాయని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. దాంతో ఏసీపీ శనివారం ప్రాణాలు కోల్పోయారు. కాగా, ఏసీపీ భార్యకు కూడా టెస్ట్‌లు చేయగా ఆమెకీ కరోనా పాజిటివ్ రావడంతో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.

Next Story

RELATED STORIES