ఏప్రిల్ 15పెళ్లి.. ఎక్కుబండి అని క్వారంటైన్‌కి..

ఏప్రిల్ 15పెళ్లి.. ఎక్కుబండి అని క్వారంటైన్‌కి..

పెళ్లిదేముంది అబ్బాయ్.. బతికి బాగుంటే మళ్లీ పెళ్లి చేసుకోవచ్చు. పద ముందు క్వారంటైన్‌కి అని తీసుకెళ్లారు అతగాడిని పోలీసులు. యూపీకి చెందిన సోనూ కుమార్.. పంజాబ్‌లోని లుథియానా టైల్స్ ఫ్యాక్టరీలో పని చేస్తున్నాడు. లాక్డౌన్‌కి ముందే అతడి పెళ్లి నిశ్చయమైంది. ముహూర్తం ఏప్రిల్ 15న ఏర్పాటు చేశారు. బంధువులు రాకపోయినా పెళ్లి కొడుకు ఒక్కడూ వచ్చినా సరిపోతుంది. ఎలాగో పెళ్లి కానిచ్చేద్దామనుకున్నారు అమ్మాయి తరపు వారు.

పెళ్లి వేదిక 1000 కిలోమీటర్ల దూరంలోని నేపాల్ సరిహద్దులో ఉన్న మహారాజ్‌ గంజ్ జిల్లాలో ఉంది. లాక్టౌన్ కారణంగా రవాణా వ్యవస్థ పూర్తిగా స్ధంభించి పోవడంతో బైక్‌పై బయల్దేరాడు సోనూ ఓ ఇద్దరు స్నేహితుల్ని వెంటబెట్టుకుని. పగలు, రాత్రి తేడాలేకుండా దాదాపు 850 కిలో మీటర్లు ప్రయాణించారు ముగ్గురూ కలిసి. అడ్డుకున్న పోలీసులకు పెళ్లి ఉందని చెబుతూ వస్తున్నారు. ఇంకో 150 కిలో మీటర్లయితే అమ్మాయింటికి వెళ్లిపోయేవారు.

కానీ యూపీలోని బలరాంపూర్ వద్దకు రాగానే పోలీసులు వారిని అడ్డుకుని క్లాస్ పీకారు. రోజూ వార్తలు వినట్లేదా.. వైరస్‌ విజృంభిస్తోంది. పాజిటివ్ కేసులు ఎక్కువవుతున్నాయి. జనాలు ఛస్తున్నారు. ఇలాంటి సమయంలో పెళ్లెలా చేసుకుంటావు. అయినా నీకు కరోనా టెస్ట్ చేయకుండా పంపించేది లేదు.. ఈ లోపు క్వారంటైన్‌కి పద. 14 రోజులైన తరువాత రిపోర్ట్ నెగిటివ్ అని వస్తే అప్పుడు వెళ్లి పెళ్లి చేసుకుందువుగానీ అని ముగ్గుర్నీ తీస్కెళ్లి క్వారంటైన్‌లో పడేశారు.

Tags

Read MoreRead Less
Next Story