కుమారస్వామి ఇంట పెళ్లి చాలా సింపుల్ గా జరిగింది: యడియూరప్ప

కుమారస్వామి ఇంట పెళ్లి చాలా సింపుల్ గా జరిగింది: యడియూరప్ప
X

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామి కుమారుడు నిఖిల్ వివాహంపై ముఖ్యమంత్రి యడియూరప్ప స్పందించారు. ఆ వివాహం గురించి చర్చించాల్సిన అవసరమేమీ లేదని.. ప్రభత్వ అనుమతితోనే వివాహం జరిగిందని అన్నారు. లాక్‌డౌన్‌ పరిమితులకు లోబడి వివాహం జరిగిందని.. అంత నిరాడంబరంగా జరిపించినందుకు నేను వారిని అభినందిస్తున్నానని యడియూరప్ప అన్నారు.

కాగా.. కరోనా ప్రభావంతో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలులో ఉన్న సమయంలో శుక్రవారం కుమారస్వామి కుమారుడు.. హీరో నిఖిల్ వివాహం జరిగింది. దీనిపై సీఎం యడియూరప్ప తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి.. పెళ్లిపై నివేదిక ఇవ్వాని ఆదేశాలు కూడా జారీ చేశారు. ఈ పెళ్లిపై చర్యలు తీసుకోకుంటే, వ్యవస్థను వెక్కిరంచినట్లే అవుతుందని డిప్యూటీ సీఎం అశ్వథ్ నారాయణ కూడా స్పష్టం చేశారు.

Next Story

RELATED STORIES