రాష్ట్రాలకు.. కేంద్ర హోంశాఖ కీలక ఆదేశాలు

కేంద్ర హోంశాఖ.. రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీచేసింది. కరోనా ప్రభావం లేని ప్రాంతాలలో లాక్‌డౌన్ సడలిస్తున్న నేపథ్యంలో.. ఆయా ప్రాంతాల్లోని వలస కూలీలకు అంతర్రాష్ట్ర ప్రయాణానికి అనుమతులివ్వొద్దని సూచించింది. కరోనా కట్టడికి లాక్‌డౌన్ విధించడంతో అనేక శిబిరాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులు ఏ పని చేయగలుగుతారో స్థానిక అధికారులు తెలియజేయాలని సూచించింది. అంతేతప్ప, ప్రస్తుతమున్న శిబిరాల నుంచి మాత్రం బయటికి మాత్రం ప్రయాణం చేయవద్దని హోంశాఖ గట్టి ఆదేశాలిచ్చింది.
దేశంలో పూర్తిగా సంక్షోభంలో చిక్కుకున్న ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు హాట్ స్పాట్ లేని ప్రాంతాలలో లాక్‌డౌన్ సడలిస్తున్నామని తెలిపింది. దీని వలన కొత్తగా సమస్యలు రాకుండా జాగ్రత్త పడాలని.. పనిచేస్తున్నప్రాంతంలో సామాజిక దూరం పాటించి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని హోంశాఖ సూచించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com