నీటిలో కరోనా అవశేషాలు.. ఆందోళనలో అక్కడి ప్రజలు

X
TV5 Telugu20 April 2020 3:06 PM GMT
కరోనాపై చేస్తున్న పరిశోధనలలో భయంకరమైన విషయాలు బయటకి వస్తున్నాయి. తాజాగా ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ నగరంలో నీటిలో కూడా కరోనా అవశేషాలు గుర్తించారు. పార్కులు, రోడ్లు శుభ్రపరచడానికి వాడే నీటి నాణ్యత గుర్తించడానికి చేసినపరీక్షల్లో ఈ విధమైన ఫలితాలు వచ్చాయి. అయితే.. 24 నీటి శాంపిల్స్ తీసుకొని పరీక్షలు జరిపితే.. నాలుగు శాంపిల్స్ లో మాత్రమే ఈ అవశేషాలు గుర్తించారు. అందులో కూడా చాలా తక్కువ స్థాయిలో గుర్తించినప్పటికీ.. స్థానిక ప్రజలు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే.. అధికారులు మాత్రం భయపడాల్సిన అవసరం లేదని అంటున్నారు. తాగటానికి వాడే నీటిని, ఇతర అవసరాలకు వాడే నీటిని వేరు చేశామని.. రెండూ వేరు, వేరుగా సరఫరా అవుతోందని తెలిపారు.
Next Story