కరోనా కట్టడికి 'కధా' పానీయం.. మేడిన్ 'మోదీ'

కరోనా కట్టడికి కధా పానీయం.. మేడిన్ మోదీ
X

ఇమ్యూనిటీ పెంచుకుంటే ఎలాంటి వైరస్ దరిచేరదని డాక్టర్లు తరచూ చెబుతుంటారు. ప్రస్తుతం ప్రపంచాన్ని వేధిస్తున్న కరోనా మహమ్మారిని తరమాలంటే రోగనిరోధక శక్తి మరింత ఎక్కువగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. మందులేని ఈ కరోనా వైరస్‌ని మట్టుపెట్టడానికి వైద్యులు ఇచ్చే ట్రీట్ ‌మెంట్ కూడా ఇదే. పాజిటివ్ కేసులను పరీక్షించి వారికి ఇమ్యూనిటీని పెంచే మందులతో పాటు ఆహార పదార్థాలను అందిస్తున్నారు. మరి కరోనా వ్యాప్తిని నిర్మూలించే దిశగా చర్యలు చేపడుతూ అందులో భాగంగానే లాక్డౌన్ విధించి ప్రజలందరినీ ఇళ్లకే పరిమితం చేసిన మన ప్రధాని మోదీ.. రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు ప్రతి ఒక్కరు కధా పానీయాన్ని తాగమంటూ, అది ఎలా తయారు చేసుకోవాలో కూడా వివరిస్తున్నారు. వనమూలికలు, సుగంధ ద్రవ్యాల సమ్మేళనమైన ఈ ఆయుర్వేద పానీయాన్ని తయారు చేసుకునే విధానము..

'కధా'కు కావలసినవి: 1 కప్పు పానీయానికి గుప్పెడు తులసి ఆకులు, యాలకులు 2, దాల్చిన చెక్క చిన్న ముక్క, శొంఠి, నల్ల మిరియాలు 5, ఎండు ద్రాక్షలు 10, నీళ్లు 3 కప్పులు, నిమ్మరసం 1 స్పూన్.

తయారు చేసే విధానం: నల్ల మిరియాలు, దాల్చిన చెక్క, శొంఠి, యాలకులను మెత్తగా పొడి చేసుకోవాలి. గిన్నెలో నీళ్లు పోసి వేడెక్కాక సిద్దం చేసుకున్న పొడి వేసి కలపాలి. తర్వాత తులసి ఆకులు, ఎండు ద్రాక్షలు కూడా వేసి అయిదు నిమిషాల పాటు తక్కువ మంట మీద మరిగించాలి. పానీయాన్ని వడగట్టి అందులో 1 స్పూన్ తేనె, నిమ్మరసం కలిపి గోరు వెచ్చగా తాగాలి. ఇలా రోజుకి ఒకటి రెండు సార్లు తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. శరీరానికి వైరస్‌తో పోరాడే శక్తి వస్తుంది.

Next Story

RELATED STORIES